అభివృద్ధిలో దూసుకెళ్తున్న చిల్కానగర్‌ డివిజన్‌

– ఎమ్మెల్యే బేతి, కార్పొరేటర్‌ బన్నాల గీత ప్రవీణ్‌
నవతెలంగాణ-ఉప్పల్‌
చిల్కానగర్‌ డివిజన్‌లో నిరంతరం అభివృద్ధి పనులు జరు గుతున్నాయని ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, కార్పొరేటర్‌ బ న్నాల గీత ప్రవీణ్‌ అన్నారు. ఆదివారం డివిజన్‌లోని- సీతారామ కాలనీ కళ్యాణ్‌ పూరికి ఓఆర్‌ఆర్‌ ఫేస్‌-2 ద్వారా మంచినీటి పైప్‌లైన్‌ మంజూరు చేశారు. అలాగే రూ.12 లక్షల వ్యయంతో నూతన శివరేజ్‌ పైప్‌లైన్‌ కోసం శంకు స్థాపన చేశారు. ఎమ్మెల్యే, కార్పొరేటర్‌ మా ట్లాడుతూ డివిజన్‌లోని వాటర్‌ పొల్యూషన్‌ ఉన్నటువంటి ప్రధానమైన హాట్‌ స్పాట్‌ లు గుర్తించి వాటన్నిటినీ నూతన పైపులైన్‌ ద్వారా మంచినీటి సరఫరా చేస్తామని అన్నారు. కాలుష్యాన్ని నివారిస్తున్నామని, మంచినీటిలో ప్రెజర్‌ ఉన్న ప్రాం తాలన్నిటిని నూతన పైపులైన్‌ వేయిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు బన్నా ల ప్రవీణ్‌ , బజార్‌ జగన్‌, బరంపేట్‌ రమేష్‌, ఏదుల్ల కొం డల్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కొక్కొండ జగన్‌, పండ్ల కిషన్‌ గౌడ్‌, మహమూద్‌ ,బాణాలు నారాయణరెడ్డి పాల్గొన్నారు.