చిల్లంకొల్లం

Chillamkollamరాస్తే కతలు కతలు
చూస్తే అంతుచిక్కని
వెతల మాటున
ఎవరికి వారే యమునా తీరే

తలరాతల్లో పిచ్చిగీతల చిత్తుపటం
నమ్మకమనే మత్తులో జోగాడుతున్న
ఊయల దారపు ఊగులాట
తెగేవరకు బండి లాగాల్సిందే

మండుతున్న చితిమీద
మసాలాదోశ ముచ్చట్లు
అచ్చమయిన మనిషి చిల్లంకొల్లం
గుండ్రటిదనుకునే భూమి మీద
లోతు తెలియని అడుగులు

వయసుడిగిన తండ్రి
ముడతలు పడ్డ దేహంతో తల్లి
సెలయేరయి పారుతున్న కన్నీరు

జీవితం ఇక
పాత ఇనుప సామాను బండి
వాళ్ళకిక మిగిలింది
ఇనుపముక్క లాంటి హదయమున్న
మనుషులు మాత్రమే
– డా.తండ హరీష్‌
8978439551