– మణిపూర్‌లో కాల్పులు..ఐదుగురు మృతి
ఇంఫాల్ : ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో అల్లర్లు చల్లారటం లేదు. ప్రతి రోజూ ఏదో ఒక రూపంలో హింస కొనసాగుతున్నది. సాయుధ దుండగులు జరిపిన దాడిలో ఇద్దరు పోలీసు సిబ్బంది మరణించిన ఒక రోజు తర్వాత మణిపూర్‌లో మళ్లీ అలజడి చెలరేగింది.రెండు వేర్వేరు కాల్పుల ఘటనల్లో మెయిటీ వర్గానికి చెందిన ఐదుగురు మరణించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మెయిటీలు, కుకీల ప్రాబల్యం ఉన్న జిల్లాల సరిహద్దులో వేర్వేరు ప్రాంతాల్లో కాల్పులు జరిగాయి. ఫలితంగా రెండు వేర్వేరు సంఘటనల్లో కనీసం ఐదుగురు మెయిటీలు మరణించారు. బుధవారం రాత్రి లోయలోని తౌబాల్ జిల్లాలో పోలీసు సంస్థల నుంచి ఆయుధాలను దోచుకునే ప్రయత్నాలు జరిగాయి. ఇందులో ముగ్గురు బీఎస్‌ఎఫ్ సిబ్బందికి బుల్లెట్ గాయాలయ్యాయి.