నిరుపేదలకు ఇండ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలి: చిలుక రాఘవులు.

నవతెలంగాణ – ధర్మసాగర్
అర్హులైన నిరుపేదలకు ఇండ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చిలుక రాఘవులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ముందు వ్యవసాయ కార్మిక సంఘం గ్రామ శాఖ కార్యదర్శి వల్లెపు రమేష్ ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాలకు పట్టాలి ఇవ్వాలని నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చిలుక రాఘవులు పాల్గొని మాట్లాడారు. ఎన్నికల ముందు అర్హులైన నిరుపేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించి ఇస్తామని ఇచ్చిన హామీ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు అమలుపరచిన దాఖలు లేవని విమర్శించారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరో మూడు లక్షల రూపాయలతో నివేశ స్థలాలు ఉన్నవారికి మూడు విడుతలుగా డబ్బులు విడుదల చేస్తానని చెప్పుతున్న ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలని అన్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మండలంలోని ముప్పారం గ్రామంలో సర్వేనెంబర్ 585 లో ఇల్లు లేని నిరుపేదలు గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారని వారికి వెంటనే అధికారులచే సర్వే నిర్వహించి,పట్టాలు జారీ చేసి ఈ మూడు లక్షల గృహలక్ష్మి పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం స్థానిక తహసిల్దార్ మర్కాల రజిని గారికి ఈ డిమాండ్లతో కూడిన మెమోరాండాన్ని ఆమెకు సమర్పించారు. ఇందుకామే సానుకూలంగా స్పందించి పై అధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యురాలు ఆరుగురు భాగ్య లక్ష్మి, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు వెల్దురి ప్రమీల, మండల ఉపాధ్యక్షులు మోడం రాజేశ్వరి, మండల కమిటీ సభ్యులు బత్తిని లావణ్య, మోడం కవిత, కర్నే దీప,మేకల తిరుపతి,మేకల సరిత, ముంజ ఉమారాణి, కందుకూరి ప్రభాకర్,కందుకూరి జయరాజ్, కందుకూరి సుగుణ, చిట్యాల కమలాకర్, కందుకూరి రేణుక,బరిగెలు ఉపేంద్ర, కందుకూరి నాగులు తదితరులు పాల్గొన్నారు.