కేబిఎ క్లబ్ అధ్యక్షునిగా చిలువేరి పవన్

నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
కమ్మర్ పల్లి బ్యాడ్మింటన్ అసోసియేషన్( కేబీఏ) క్లబ్ అధ్యక్షుడిగా చిలువేరి పవన్ కుమార్ ఏకగ్రీవంగాఎన్నికయ్యారు.ఈ మేరకు ఆదివారం కమ్మర్ పల్లి బ్యాడ్మింటన్ అసోసియేషన్ క్లబ్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ఎన్నికలలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు ప్రోటీన్ స్పీకర్ లుక్క గంగాధర్ తెలిపారు. నూతన అధ్యక్షులుగా చిలువేరి పవన్ కుమార్, ఉపాధ్యక్షుడిగా జోగా గంగాధర్, ప్రధాన కార్యదర్శిగా గణపురం రవి, కోశాధికారిగా చింత ప్రదీప్, సహాయ కార్యదర్శిగా సుంకేట రమేష్  లను ఇతర సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కేబీఏ క్లబ్ కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ క్లబ్ అభివృద్ధికి తమ వంతుగా కృషి చేస్తామన్నారు.కమ్మర్ పల్లి బ్యాడ్మింటన్ అసోసియేషన్ క్లబ్ ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించడం ద్వారా యువతలో దాగివున్న ప్రతిభను వెలికి తీసేందుకు క్లబ్ ద్వారా కృషి చేస్తామన్నారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు ఇతర సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నూతనంగా ఎన్నికైన క్లబ్ కార్యవర్గ సభ్యులతో ప్రోటీన్ స్పీకర్ లుక్క గంగాధర్ ప్రమాణ స్వీకారం చేయించారు.