చిమ్నీలు

1
మనసులో అదుపు
మాటలలో పొదుపు
చేతలలో మెరుపు
చేకూర్చును గెలుపు!!
2
అంతర్ముఖానికి…
ముసుగేసి అందలము
తెలుసు మనస్సాక్షికి
ఆ బతుకు వ్యర్థము !!
3
అలలకు అలుపు లేదు
తీరం చేరకున్న…
తలపులకలుపు లేదు
ఎప్పుడు తలుచుకున్న !!
4
దిగంతమనె ఇరుసుకు
ఇరువైపులిద్దరము
చక్రాల్ల కాలముకు
పగలు-రేయిగ మనము!!
5
జన్మనిచ్చిన మాత
మొదటి దైవము
నడత నేర్పిన పిత
గురువుతో సమానము!!
6
భరించేది ఆలి
బతుకునిచ్చెది ఆలి
చెలిమినిచ్చెది ఆలి
చేరదీసెది ఆలి !!
7
భావోద్వేగాలు
రాగద్వేషాలు
ఈర్ష్య-అసూయలు
వీడు… స్థితప్రజ్ఞులు !!
8
శరీర కదలికల
వ్యాయామముగ
మేధ, ఆత్మశక్తిల
కలయిక యోగ !!
9
భక్తి మనసులో…
రక్తి మాటలలో…
యుక్తి చేతలలో…
ముక్తి బతుకులో !!
10
ఓటు అంటే మనసు
లొంగకు ‘తాయిలా’ కు
తెలివిగవాడు త్రాసు…
మంచిది నీ భవితకు !

– న్యాలకంటి నారాయణ,
9550833490