హెచ్‌ఎంపివి తగ్గుముఖం : చైనా

HMPV on the decline: Chinaబీజింగ్‌ : హ్యూమన్‌ మెటానిమోవైరస్‌ (హెచ్‌ఎంపివి) పాజిటివ్‌ రేటు తగ్గుముఖం పట్టిందని చైనా తాజాగా ప్రకటించింది. చైనాలో ఇటీవల హెచ్‌ఎంపివితో సహా పలు శ్వాసకోశ వ్యాధులు ఎక్కువగా నమోదవుతున్నట్లు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ఉత్తర చైనా ప్రాంతంలో హెచ్‌ఎంపివి ప్రభావం ఎక్కువగా కనిపిస్తోందనే కథనాలు వెలువడ్డాయి. అయితే, ఉత్తర ప్రాంతంలో హెచ్‌ఎంపివి ఇన్ఫెక్షన్‌ రేటు ప్రస్తుతం తగ్గుముఖం పడుతోందని చైనా ఆరోగ్యశాఖ అధికారులు తాజాగా వెల్లడించారు.