‘విద్యుత్‌ యుగం’ అగ్రగామిగా చైనా

'విద్యుత్‌ యుగం' అగ్రగామిగా చైనానివేదిక
ప్రపంచ ఇంధన మార్కెట్‌ చైనా నేతత్వంలోని కొత్త ‘విద్యుత్‌ యుగం’లోకి ప్రవేశిస్తోందని, దశాబ్దం చివరి నాటికి శిలాజ ఇంధన డిమాండ్‌ గరిష్ట స్థాయికి చేరుకుంటుందని ఇంటర్నేషనల్‌ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) తెలిపింది. పరిశ్రమలు, ఎలక్ట్రిక్‌ వాహనాలు, డేటా సెంటర్ల ద్వారా బ్యాటరీలు, సోలార్‌ ప్యానెల్‌ల ఉత్పత్తి పెరగడంతో స్వచ్ఛమైన శక్తి ఉత్పత్తి ‘అపూర్వమైన వేగం’తో పురోగమిస్తున్నదని బుధవారం ప్రచురించిన వార్షిక వరల్డ్‌ ఎనర్జీ ఔట్‌లుక్‌లో ఐఈఏ పేర్కొంది.
ప్రపంచంలోని అగ్ర చమురు వినియోగదారుల్లో ఒకరిగా మిగిలిపోయినప్పటికీ, 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా వ్యవస్థాపించిన మొత్తం పునరుత్పాదక శక్తి సామర్థ్యంలో చైనా దాదాపు 60 శాతం వాటాను కలిగి ఉంటుందని ఐఈఏ పేర్కొంది. చైనా సౌర ఉత్పత్తి మాత్రమే రాబోయే దశాబ్దం నాటికి అమెరికా మొత్తం విద్యుత్‌ డిమాండ్‌ను అధిగమించే అవకాశం ఉంది. ఐఈఏ ప్రకారం, ఉక్రెయిన్‌, మధ్యప్రాచ్యంలోని సంఘర్షణలు ప్రపంచ ఇంధన వ్యవస్థపై ఒత్తిడిని పెంచటం వల్ల ‘క్లీనర్‌, మరింత సురక్షితమైన సాంకేతికతల’ అభివృద్ధిని వేగవంతం చేయడానికి పెట్టుబడి అవసరాన్ని బహిర్గతం చేశాయి.
”ఇందన చరిత్రలో, మేము బొగ్గు యుగం, చమురు యగాన్ని చూశాం” అని ఐఈఏ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఫాతిహ్ బిరోల్‌ వివరించాడు. ‘మేము ఇప్పుడు విద్యుత్‌ యుగంలోకి వేగంగా కదులుతున్నాం. ఇది ప్రపంచ ఇంధన వ్యవస్థ ముందుకు సాగడాన్ని నిర్వచిస్తుంది. ఇది ఎక్కువగా విద్యుత్తు స్వచ్ఛమైన వనరులపై ఆధారపడి ఉంటుంది’ అని ఆయన చెప్పాడు. గతేడాది ప్రపంచ వ్యాప్తంగా 560 గిగావాట్ల (జిడబ్ల్యూ) కంటే ఎక్కువ పునరుత్పాదక శక్తి సామర్థ్యంతో సహా, రికార్డు స్థాయిలో క్లీన్‌ ఎనర్జీ వచ్చిందని ఐఈఏ తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా క్లీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుల్లో ఏటా దాదాపు 2 ట్రిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెడుతున్నారని, శిలాజ ఇంధనాలపై పెట్టుబడి పెట్టే మొత్తం దాదాపు రెట్టింపు అవుతుందని పారిస్‌ ఆధారిత సంస్థ తెలిపింది.
”అనేక దేశాల్లో ఆసక్తిని పెంచుతున్న అణుశక్తితో కలిసి, తక్కువ ఉద్గారాల మూలాలు 2030కి ముందు ప్రపంచంలోని విద్యుత్‌లో సగానికి పైగా ఉత్పత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి” అని నివేదిక పేర్కొంది. అదే సమయంలో, ఐఈఏ ప్రకారం, శిలాజ ఇంధనాల కోసం డిమాండ్‌ ఇప్పటికీ దశాబ్దం చివరి నాటికి గరిష్ట స్థాయికి చేరుకోవచ్చని అంచనా వేయబడింది. ఎందుకంటే స్వచ్ఛమైన శక్తి విస్తరణ, సాంకేతికతలు దేశాల్లో ఏకరీతిగా లేదు.’ ‘క్లీన్‌ ఎనర్జీ ట్రాన్సిషన్స్‌ వెనుక పెరుగుతున్న మొమెంటం’ ఉన్నప్పటికీ, 2050 నాటికి కార్బన్‌ న్యూట్రల్‌గా మారాలనే లక్ష్యంతో సాగుతున్న ప్రపంచం ‘ఆ సదిశకు ఇంకా చాలా దూరంలో ఉంది’ అని ఐఈఏ తెలిపింది.