చిన్నా రిలీజ్‌కి రెడీ

little one Ready for releaseసిద్ధార్థ్‌ సరికొత్త పాత్రలో నటించిన చిత్రం ‘చిన్నా’. ఎమోషనల్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమాను ఎటాకి సంస్థ నిర్మించింది. ఏషియన్‌ సినిమాస్‌ ద్వారా తెలుగులో విడుదలవుతోందీ చిత్రం.
చిన్నాన్నకి, అతని అన్నయ్య కూతురుకి మధ్య ఉన్న అందమైన అనుబంధంతో ఎస్‌.యు. అరుణ్‌కుమార్‌ దర్శకత్వం వహించారు. మంగళవారం ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరిగింది. ఏషియన్‌ మల్టీప్లెక్స్‌ ప్రై.లి హెడ్‌ జాన్వీ మాట్లాడుతూ, ‘తమిళంలో ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. చాలా స్పెషల్‌ మూవీ అని చెబుతున్నారు. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు కూడా అలాంటి రెస్పాన్స్‌నే అందిస్తారని భావిస్తున్నాం.
ఈనెల 6న థియేటర్స్‌లో కలుద్దాం’ అని అన్నారు. హీరో సిద్ధార్థ్‌ మాట్లాడుతూ, ‘ఈ సినిమా నా లైఫ్‌ డ్రీమ్‌. నా కెరీర్‌లోనే బెస్ట్‌ సినిమా ఇది. నేను కె.విశ్వనాథ్‌ సినిమాలను చూసే మూవీస్‌ గురించి నేర్చుకున్నాను. అందుకనే ఈ సినిమాను ఆయనకు అంకితమిస్తున్నాను’ అని అన్నారు.