తెలంగాణ వేడుకల నిర్వహణ కమిటీ చైర్మెన్‌గా చిన్నారెడ్డి

నవతెలంగాణబ్యూరో హైదరాబాద్‌
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల కమిటీ చైర్మెన్‌, మాజీ మంత్రి చిన్నారెడ్డిని కాంగ్రెస్‌ పార్టీని నియమించింది. కన్వీనర్లుగా జి నిరంజన్‌, చెరుకు సుధాకర్‌, సభ్యులుగా అనంతుల శ్యామ్‌ మోహన్‌, రియాజ్‌, రవి,జ్ఞానసుందర్‌ను నియమించింది. ఈ సందర్భంగా చిన్నారెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరేర్చిన రోజును ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. జూన్‌ 2న అన్ని జిల్లాల్లో జాతీయ జెండా ఎగురవేయాలని కోరారు. ఆయా జిల్లాల్లో ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించాలని కోరారు.