ఆర్ వీ రెడ్డి సమర్పణలో ఆర్వీ సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ రామిరెడ్డి, డాక్టర్ తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్న సినిమా ‘అరి’. ‘మై నేమ్ ఈజ్ నో బడీ’ అనేది ఉపశీర్షిక. ‘పేపర్ బారు’ దర్శకుడు జయశంకర్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా ఆదివారం ‘అరి’ సినిమా నుంచి ‘చిన్నారి కిట్టయ్య..’ లిరికల్ సాంగ్ మంగ్లీ వెర్షన్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘ఈ సినిమా గురించి వింటున్నాను. ఈ మూవీ డైరెక్టర్ జయశంకర్ గతంలో ‘పేపర్ బారు’ అనే మంచి మూవీ రూపొందించారు. ఈ సినిమా కూడా ఆయనకు సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. ఈ సినిమాలో ‘చిన్నారి కిట్టయ్య’ పాట మంగ్లీ వెర్షన్‌ని రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది’ అని చెప్పారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.