ఎంపీపీ పదవికి చింతా కవితా రాదారెడ్డి రాజీనామా…

– ఎంపీటీసీగా, ఎంపీపీ గా అవకాశం కల్పించిన  పార్టీకి, మాజీ శాసనసభ్యులు మల్లయ్య యాదవ్, ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటా
– అన్నిరకాలుగా ప్రోత్సాహకమందించిన ఎంపీటీసీలకు, అధికారులకు, అనధికారులకు, కార్యాలయ సిబ్బందికి, పాత్రికేయులకు కృతజ్ఞతలు
– ప్రజల విశ్వాసం మేరకు అవిశ్రాంత పోరాటం
– మండల సమగ్రాభివృద్ధికి సేవ చేసే భాగ్యం రావడం నా అదృష్టం
– నాపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు.నిరూపణకు ఎంతకైనా సిద్ధం
– రాజకీయ దురుద్దేశంతోనే ఉదేశ్యపూర్వకంగా నిందారోపణలు
– మనస్సాక్షికి లోబడి నైతిక భాద్యతగా రాజీనామా – ఎంపీపీ చింతా కవితా రాదారెడ్డి
– జిల్లా పరిషత్ సీఈఓ కి రాజీనామా లేఖ సమర్పించిన కోదాడ ఎంపీపీ చింతా కవితా రాదారెడ్డి
నవతెలంగాణ- కోదాడరూరల్
కోదాడ మండల పరిషత్ అధ్యక్ష పదవికి ఎంపీపీ పదవికి చింతా కవితా రాదారెడ్డి రాజీనామా సోమవారం చేశారు. ఈ సందర్భంగా కోదాడ ఎంపీపీ చింతా కవితా రాదారెడ్డి మాట్లాడుతూ రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం నుండి వచ్చినప్పటికీ రాజకీయాలకు కొత్త అయినా ఎంపీటీసీ గా,ఆ తదుపరి ఎంపీపీగా అవకాశం కల్పించిన బిఆర్ఎస్ పార్టీకి ఆదేవిధంగా మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ కి, గుడిబండ గ్రామ ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని నాకు ఇచ్చిన సదావకాశాన్ని నా శక్తికి మించి గుడిబండ గ్రామంతో పాటుగా మండల పరిధిలోని అన్ని గ్రామాల సమగ్రాభివృద్ధికి కృషి చేసి మండలాన్ని ఆదర్శంగా నిలపడం సంతోషాదాయకం. పదవులు రాజకీయంలో శాశ్వతం కాదని చేసిన సేవ మాత్రమే శాశ్వతమని మారుతున్న రాజకీయ సమీకరణాలు దృష్ట్యా నాకు అండగా నిలబడి ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఎంపీటీసీ లే నన్ను వ్యతిరేకిస్తూ నాపై అవిశ్వాసం ఏర్పాటు చేయడంతో మండల అధ్యక్షురాలిగా వారు నా పట్ల విముఖతతో ఉన్నారని భవిస్తూ వారి అభిప్రాయానికి వ్యతిరేకంగా వెళ్లడం ఇష్టం లేక సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తిగా, వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా మనస్సాక్షికి లోబడి నైతికభాద్యతగా మండల అధ్యక్షురాలి పదవికి రాజీనామాను జిల్లా సీఈఓ కి ఆయన కార్యాలయం సమర్పించారు. నా రాజీనామాలో ఎలాంటి వ్యక్తిగత రాజకీయ దురుద్దేశాలు లేవని ఎవరి ఒత్తిడి ప్రోద్బలం లేకుండా నా ఇష్టపూర్తిగా రాజీనామా చేస్తున్నాను. ఈ నాలుగున్నారేళ్ల కాలంలో నాకు అన్ని విధాలుగా సహకరించి తోబుట్టువుగా భావించి అక్కున చేర్చుకుని ఆదరించిన ప్రజలకు, ఎంపీటీసీలకు, సర్పంచులకు, ఇతర ప్రజా ప్రతినిధులకు, అధికారులకు అనధికారులకు, పత్రికా విలేఖరులకు మండల పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు. వీరి వెంట మోతె మండల అధ్యక్షులు శీలం సైదులు, మండల సర్పంచులు శెట్టి సురేష్ నాయుడు, పాముల మస్తాన్, భూక్యా సైదా,మండల కో ఆప్షన్ సభ్యులు షేక్ ఉద్దండు, దాసరి వీరబాబు, అంబడిపూడి రవి కుమార్ తదితరులు ఉన్నారు.