బీఆర్‌ఎస్‌కు చింతకాయల రాజీనామా

నవతెలంగాణ-మునగాల
మండలకేంద్రానికి చెందిన బీఆర్‌ఎస్‌ గ్రామ శాఖ నాయకులు బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు చింతకాయల నాగరాజు ఆ పార్టీ కి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. పార్టీలో కష్టపడి పని చేసినా తనకు కనీస గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు.2018లో ఎమ్మెల్యే గెలుపు కోసం ఎంత గానో కషిచేశానని చెప్పారు.2019లో తనకు మునగాల గ్రామ సర్పంచ్‌ అభ్యర్థిగా టికెట్‌ ఇచ్చి ఆ తర్వాత నన్ను పోటి నుంచి అన్యాయంగా తప్పించారని చెప్పారు.తదనంతరం పార్టీలోకి వచ్చిన నాయకులు తనను పలు రకాలుగా ఇబ్బందులకు గురిచేశారని తెలిపారు. పార్టీలో ఎలాంటి పదవులు ఇవ్వక పోవడం బాధకలిగించిందన్నారు.ఇటీవలకాలంలో ఇష్టానుసారంగా ఇచ్చిన బీసీ లోన్ల విషయంలో తీవ్ర మనస్తాపానికి గురైయ్యానని చెప్పారు.తనకు జరిగిన అన్యాయాన్ని కోదాడలోని పార్టీ పెద్దలకు ఎన్నిసార్లు చెప్పుకున్నా పట్టిం చుకునే దిక్కే లేదన్నారు.కొన్నాళ్ళుగా పార్టీలో విసిగిపోయి చివరకు రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చానని చెప్పారు.