చింతల చేరువు తుము బాగు చేసిన విడిసి..

నవతెలంగాణ – మాక్లూర్
మండల కేంద్రంలోని చింతల చెరువు తుమును గ్రామ కమిటీ అధ్వర్యంలో రిపేర్ చేయించి గురువారం బిగించారు. గతంలో మిషన్ కాకతీయ పథకంలో సదరు కాంట్రాక్టర్ సరిగ్గా తూమును బిగించకపోవడంతో చెరువులోకి నీరంతా బయటకు వెళ్ళిపోయాయి. రైతులు సిమెంట్ సంచులతో మట్టి నింపి తుముకు అడ్డంగా వేసి నీటిని బయటకు వెళ్ళకుండా అపారు. ఈ విషయాన్ని ఇరిగేషన్ అధికారులకు తెలిపిన పట్టించుకోకపోవడంతో గ్రామ కమిటీ అధ్వర్యంలో నూతన తూమును గ్రామ రైతుల సహకారంతో ఏర్పాటు చేశారు.