ఫైళ్ల శేఖర్ రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి: చింతల

నవతెలంగాణ- వలిగొండ రూరల్
 వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భువనగిరి బిఆరెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఫైళ్ల శేఖర్ రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బిఆరెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని పహిల్వాన్ పురంలో గౌడన్నను ఓటు అడిగి ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. ఈ నెల 30 న జరుగనున్న ఎన్నికల్లో శేఖర్ రెడ్డి కి అత్యధిక ఓట్లు వేయాలని, భువనగిరి నియోజకవర్గానికి  ముఖ్యమంత్రి చలువతో ఎన్నో అభివృద్ధి పనులు చేశారని, ఈ ప్రాంతంలో మిగిలిపోయిన అభివృద్ధిని పూర్తి చేస్తారని అన్నారు.మండలంలోని వేములకొండ, ఎం తుర్కపెళ్లి, చిత్తపురం, వివిధ గ్రామాలలో స్థానిక నాయకులు శేఖర్ రెడ్డి గెలుపుకు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎంపిటిసి తుమ్మల వెంకట్ రెడ్డి, కేశిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, ఎలిమినేటి జంగా రెడ్డి, తుమ్మల వెంకట్ రెడ్డి, గడ్డమీది ధనుంజయ్య, పచ్చిమట్ల మల్లేష్, బండారు రాజు, బండారు శ్రీనివాస్, రమేష్, అంబటి మోహన్, లింగ్ స్వామీ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.