నవతెలంగాణ – ఉప్పునుంతల
నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం పరిధిలోని వెలటూర్ గ్రామంలో ఉపాధి కూలీలు పనిచేసే పని ప్రదేశాన్ని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సందర్శించి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి చింతల నాగరాజు కూలీల సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఉపాధి కూలీల రోజు వేతనం రూ.300 నిర్ణయిస్తే అమలులో మాత్రం సరాసరి రూ.180 రూ.లకు మించి రావటం లేదనీ తెలిపారు.కూలీలకు సమ్మర్ అలవెన్స్ ఇవ్వాలి అని అన్నారు. ఉపాధి కూలీలకు 200 రోజులు పని దినాలు పెంచాలన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఉపాధి కూలీలకు రోజు కూలీ 600 రూపాయలు ఇవ్వాలని సంఘం తరపున డిమాండ్ చేశారు. ఉపాధి కూలీలకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని అన్నారు. ఈ ఉపాధి కార్యక్రమంలో ప్రహ్లాద్, సాలయ్య,రవి, నారయ్య, శ్రీను, రాములు తదితరులు పాల్గొన్నారు.