భువనగిరి మండలం లోని తాజ్పూర్ గ్రామ మాజీ సర్పంచ్ బొమ్మరపు సురేష్ తండ్రి యాదగిరి ఇటీవలనే మరణించగా , సురేష్ కుటుంబ సభ్యులను బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి ఆదివారం పరామర్శించారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి , నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు డాక్టర్ ర్యాకల శ్రీనివాస్, జిల్లా నాయకులు కుత్తాడి సురేష్, వల్లపు విజయ్, జి శ్రీశైలం, నరేష్ గౌడ్ లు పాల్గొన్నారు.