– అండర్-23 ప్రపంచ రెజ్లింగ్ పోటీలు
న్యూఢిల్లీ : ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్స్ (అండర్ 23)లో యువ రెజ్లర్ చిరాగ్ పసిడి పతకం సాధించాడు. పురుషుల 57 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో పోటీపడిన చిరాగ్ ప్రతిష్టాత్మక పోటీల్లో బంగారు పతకం సాధించిన మూడో భారత మల్లయోధుడిగా నిలిచాడు. ఒలింపిక్ మెడలిస్ట్ పవన్ సెహావ్రత్, రితీక హుడా మాత్రమే ఇప్పటి వరకు అండర్23 ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో స్వర్ణాలు సాధించారు. సోమవారం జరిగిన పసిడి పోరులో కిర్గిస్థాన్ రెజ్లర్ కరచోవ్‌పై 4-3తో ఆఖరు క్షణాల్లో ఆధిపత్యం సాధించిన చిరాగ్ పసిడి నెగ్గి చాంపియన్‌గా నిలిచాడు. అండర్-23 ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్స్‌లో భారత్ ఓ స్వర్ణం, సిల్వర్ సహా తొమ్మిది పతకాలు సాధించింది.