
అకాల వర్షాలతో పంటలు దేబ్బతిని నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కాటారం ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంథని చిరంజీవి గురువారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా మాట్లాడారు ఇటీవల కురిసిన అకాల వర్షానికి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలమారు చేశారు.ఇటీవల కురుస్తున్న అకాల వర్షాల దాటికి కల్లాల్లో వడ్లు తడిచిపోయాయని వెంటనే వాటిని ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరారు.ఎద్దేడిసిన ఎవుసం, రైతేడ్చిన రాజ్యం బాగుపడినట్లు చరిత్ర లో లేదని అందుకే తడిసిన ప్రతీ గింజను కొనుగోలు చేసి ఆదుకోవాలన్నారు.కాటారం మండలం లోని ఆయా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని కొనాలని లేనిపక్షం లో ఎమ్మార్పిఎస్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు చేపడుతామని మంతెన చిరంజీవి మాదిగ హెచ్చరించారు.