నకిరేకల్‌లో చిరుమర్తి మార్నింగ్‌ వాక్‌

నవతెలంగాణ-నకిరేకల్‌
నకిరేకల్‌ మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో మంగళవారం మార్నింగ్‌ వాక్‌లో భాగంగా స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పర్యటించారు. ఈ సందర్బంగా గడప గడపకు వెళ్లి ప్రజలను ఆత్మీయంగా పలకరించారు. ఈ సందర్బంగా పిల్లలను, వృద్ధులతో మాట్లాడి వారి చదవులను, ఆరోగ్య పరిస్థితులను, వార్డులలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వృద్ధులకు పెన్షన్‌ అందుతుందా.. లేదా.. అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. సీసీ రోడ్లు, డ్రెయినేజీ, విధి దీపాలు, విద్యుత్‌ స్థంబాల సమస్యలను తెలుసుకొని సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నిరుపేద కుటుంబానికి చెందిన కొలను ప్రియాంక ల్యాప్‌ టాప్‌ కావాలని అడగడంతో కొనిస్తామని హామీ ఇచ్చారు. సుంకి మానస బి. పార్మసీ చదువుతుండడంతో ఆమెకు ఒక సంవత్సరం కాలేజీ ఫీజు ను కడుతానని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరు పార్టీలకతీతంగా బీఆర్‌ఎస్‌ కు మద్దతు పలకాలని వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ను గెలిపించాలని కోరారు.