చిరుమర్తి రోడ్ షో

నవతెలంగాణ- చిట్యాల: నకిరేకల్ నియోజక వర్గంలో జరుగుచున్న ఎన్నికలు అహంకారానికి, అభివృద్ధికి మధ్యన జరుగుతున్న పోరుగా నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. చిట్యాల పట్టణ కేంద్రంలో శనివారం రోడ్ షో నిర్వహించిన అనంతరం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గుత్తా అమిత్ రెడ్డితో కలిసి  కనకదుర్గ కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రశాంతతకు రౌడీ ఇజానికి మధ్యన ఈ పోరు జరుగుతుందని అన్నారు. సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేసి ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తెలంగాణను అభివృద్ధి పథంలో తీర్చిదిద్దారని అన్నారు. జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలందరూ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జడల ఆది మల్లయ్య యాదవ్, బారాస పట్టణ అధ్యక్షుడు పొన్నం లక్ష్మయ్య గౌడ్, జిట్ట చంద్రకాంత్, ఇతర ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.