– భారీగా తరలివచ్చిన ప్రజలు
నవతెలంగాణ-చిట్యాలటౌన్
నకిరేకల్ నియోజకవర్గంలో జరుగుచున్న ఎన్నికలు అహంకారానికి, అభివద్ధికి మధ్య జరుగుతున్న పోరుగా నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అభివర్ణించారు. చిట్యాల మున్సిపల్ కంద్రంలో శనివారం స్థానిక తహసీల్దార్ కార్యాల యం నుండి కనకదుర్గ సెంటర్ వరకు రోడ్ షో నిర్వహించిన అనంతరం బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు గుత్తా అమిత్‌రెడ్డితో కలిసి కనకదుర్గా సెంటర్‌లో జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ప్రశాంతతకు, రౌడీయిజానికి మధ్య ఈ పోరు జరుగుతుందన్నారు.వ్యవసాయం దండగ అనే స్థితి నుండి సీఎం కేసీఆర్ వ్యవసాయరంగానికి పెద్ద పీట వేసి వ్యవసాయం పండుగ అనే స్థితి వరకు తీసుకొచ్చారన్నారు.ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తెలంగాణను అభివద్ధి పథంలో తీర్చిదిద్దారన్నారు.9 ఏండ్లలో జరిగిన అభివద్ధిని చూసి ప్రజలందరూ కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు.చిట్యాల మున్సిపాలిటీని వీరేశం ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నిధులు ఉండి కూడా అభివద్ధి చేయలేకపోయారని విమర్శించారు. ఉదయ సముద్రం ప్రాజెక్టును ఏనాడు పట్టించుకోలేదన్నారు.శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి చొరవతో పిలాయిపల్లి కాల్వ పనులు పూర్తి చేశామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ కోమటిరెడ్డి చిన్నవెంకట్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మెన్ జడల ఆది మల్లయ్యయాదవ్, బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు పొన్నం లక్ష్మయ్యగౌడ్, జిట్ట చంద్రకాంత్, ఇతర ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.