కాంగ్రెస్‌లో చేరిన చిట్యాల బీఆర్‌ఎస్‌ నాయకులు

నవతెలంగాణ-పరిగి
ఆదివారం పరిగి పట్టణ కేంద్రంలోని టీఆర్‌ఆర్‌ నివాసంలో పరిగి మండలం చిట్యాల గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి సతీమణి ఉమారెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్యకర్తలు చురుగ్గా పనిచేయాలని సూచించారు. రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరిన వారిలో టి.శ్రీనివాస్‌, ఈ.ప్రవీణ్‌, ఎన్‌.గోపాల్‌, టి.దశరథ, పి.శ్రీనివాస్‌, పి.వెంకటేష్‌, అంజయ్య ముదిరాజ్‌, మహేష్‌, టి.నారాయణ, జి.రమేష్‌, జి.శేఖర్‌, చెన్నయ్య, అంజయ్య, ఆర్‌.నర్సింలు, శ్రీనివాస్‌ ముదిరాజ్‌, గూడరామ్‌, పత్తిజంగయ్య, ఆర్‌.గంగపురి, శశికుమార్‌, జి.శివకుమార్‌, జి.రామకృష్ణ, ఎం.రాజు, ఎస్‌.శ్రీనివాస్‌, ఆర్‌.యాదయ్య కే.ఈశ్వయ్య, కె.నర్సింలు, డీసీసీ ఉపాధ్యక్షులు లాల్‌ కృష్ణ ప్రసాద్‌, డీసీసీ ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్‌, మండల పార్టీ అధ్యక్షుడు భూమనగారి పరశురాం రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఎర్రగడ్డ పల్లి కృష్ణ, సర్పంచ్‌ రజిత పుల్లారెడ్డి, దండు అశోక్‌, రాజ పుల్లారెడ్డి, థౌర్య నాయక్‌, శశిధర్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.