నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సూర్యాపేట జిల్లా వాసి చిట్యాల రాజుకు ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో డాక్టరేట్ పట్టా వరించింది. డాక్టర్ ఎవి కృష్ణప్రసాద్ పర్యవేక్షణలో ‘ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ నెట్‌వర్క్‌కు అనుసంధానమయ్యే వివిధ రకాల స్మార్ట్ డివైజెస్‌ల అథెంటికేషన్, డాటా సెక్యూరిటీ విషయంలో ఎదురయ్యే సవాళ్లను మెషిన్ లెర్నింగ్ సహాయంతో ఎలా అధిగమించొచ్చు’అనే విషయంపై ఆయన పరిశోధన చేశారు. ప్రతిష్టాత్మకమైన ఓయూ డాక్టరేట్‌ను మంగళవారం రాజుకు ప్రదానం చేశారు. ఇదే అంశంపై ఆయన రచనలు, వ్యాసాలు జాతీయ, అంతర్జాతీయ జర్నల్లలో ప్రచురితమయ్యాయి. ఈ సందర్భంగా సైఫాబాద్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ జె లక్ష్మణ్‌నాయక్‌తోపాటు అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు.