
ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రసవాలు జరిగే విధంగా చూడాలని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రుక్మిణి తెలిపారు. శనివారం పట్టణ కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఆస్పత్రి పరిసరాలను, రికార్డులను, ఓపి , వ్యాక్సినేషన్ వివరాలు పరిశీలించారు. క్రమం తప్పకుండా చిన్నారులకు వేసే విధంగా వైద్య సిబ్బందికి సూచించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ దివ్య, హెచ్ఈవో వెంకటరమణ, వైద్య సిబ్బంది ఉన్నారు.