బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఎంపికలు

Choices of ball badminton playersనవతెలంగాణ – ఆర్మూర్
70వ సీనియర్ రాష్ట్రస్థాయి బాల్ బ్యాట్మెంటన్ క్రీడా పోటీలకు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘం ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని విజయ్ హైస్కూల్ లో క్రీడాకారుల సెలక్షన్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షులు మానస గణేష్ మాట్లాడుతూ క్రీడాకారులు జిల్లా జట్టును ప్రథమ స్థానంలో నిలుపాలని, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరినారు.ఎంపికైన క్రీడాకారులకు శిక్షణ శిబిరం నిర్వహించి మహిళలకు మోర్తాడ్ గర్ల్స్ హై స్కూల్, పురుషులకు రెంజల్ హై స్కూల్ నందు శిక్షణ శిబిరం నిర్వహించడం జరుగుతుంది అని అన్నారు. ఈనెల 8వ తేదీ నుండి 11వ తేదీ వరకు జవహర్లాల్ నెహ్రూ స్టేడియం హనుమకొండలో జరిగే 70వ తెలంగాణ రాష్ట్రస్థాయి సీనియర్ పురుషుల మరియు మహిళా బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ కు జిల్లా జట్టుకు ప్రాతినిథ్యం వహించడం జరుగుతుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో ,విజయ హై స్కూల్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కవిత దివాకర్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘం ప్రధాన కార్యదర్శి శ్యామ్, సీనియర్ క్రీడాకారులు. ఆర్ అండ్ బి ఇంజనీర్ సీనియర్ క్రీడాకారులు నాందేవ్ ,కామారెడ్డి జిల్లా కార్యదర్శి కృష్ణమూర్తి, సంఘ సభ్యులు సురేష్, సింధుజ, శ్యామల పాల్గొన్నారు.