జిల్లాస్థాయిలో జరిగిన బయోలాజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్ లో మండలంలోని చౌట్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని సబా సాదియా ఉత్తమ ప్రతిభ కనబరిచి ద్వితీయ స్థానాన్ని పొందినట్లు మండల విద్యాధికారి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నేర ఆంధ్రయ్య తెలిపారు.జిల్లా స్థాయి బయాలజీకల్ సైన్స్ టాలెంట్ టెస్టులో విద్యార్థిని సబా సాదియా ద్వితీయ స్థానం సాధించి జిల్లా విద్యాధికారి అశోక్ చేతుల మీదుగా అవార్డు తో పాటు రూ.1000 ప్రైజ్ మని అందుకున్నట్లు ఎంఈవో తెలిపారు. ఇప్పటివరకు మండల స్థాయిలో నిర్వహించిన ప్రతి టాలెంట్ టెస్టుల్లో కూడా ప్రతి సబ్జెక్టు లో సబా సాదియా మండల టాపర్ గా నిలిచినట్లు తెలిపారు. మాథ్స్ లో కూడా జిల్లా స్థాయిలో తృతీయ స్థానం సాధించినట్లు ఆయన వివరించారు. కార్యక్రమంలో సైన్స్ ఉపాధ్యాయులు మగ్గిడి నరేందర్, తదితరులు పాల్గొన్నారు.