ఘనంగా బేతెస్థ మందిరంలో క్రిస్మస్ సంబురాలు…

నవతెలంగాణ- చివ్వేంల : స్థానిక సూర్యాపేట పట్టణ కేంద్రం లోని 4వ వార్డు, ఖాసీంపేట నందు బేతెస్థ ప్రార్ధన మందిరం నందు బిషప్ దుర్గం ప్రభాకర్ -కరుణ శ్రీ(హెప్సిబా) ఆధ్వర్యంలో ఘనంగా క్రీస్తు పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిధులుగా సీనియర్ న్యాయవాది గుడపురి వెంకటేశ్వర్ రావు ఏ. జి. పి సూర్యాపేట , డా. ఊర రాంమూర్తి యాదవ్ లు పాల్గొని కేక్ కట్ చేసి, స్విట్స్ పంచిపెట్టారు. అనంతరం 100 మంది వితంతు, వృద్ద క్రైస్తవులకు పేదలకు దుస్తులు పంపిణి చేశారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలో   పాల్గొని మాట్లాడారు..ఈ కార్యక్రమం లో   బిషప్ యం. పి. హెచ్. హెచ్ మోజెస్,పల్లెటి సైమన్ రాజు,వాస సాగర్,యాడవెల్లి యేసుపాదం, మీసాల తీతు, బాబు, ఉపేందర్,సురేష్, కళింగ రెడ్డి, సతీష్, వెంకట్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు…