బహదూర్ పుర లో క్రిస్మస్ వేడుకలు..

Christmas celebrations in Bahadurpura..– పాల్గొన్న ఎంఐఎం నాయకులు..
నవతెలంగాణ – ధూల్ పేట్

బహదూర్ పుర నియోజకవర్గంలో దూద్ బౌలి బేతెల్ ఫెలోషిప్ వర్షిప్ మినిస్ట్రీ వారి ఆధ్వర్యంలో కామటి పుర హెచ్ఎం బాక్యూట్  హాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. పాస్టర్ పి ఆనంద్ కుమార్, అబ్రహం లు క్రీస్తు సందేశాన్ని వినిపిస్తూ….. ఏసుక్రీస్తు ఈ లోకంలో జన్మించడం ప్రజలందరికీ మహా సంతోషకరమైన శుభవార్త అన్నారు. రక్తం చిందించకుండా పాప క్షమాపణ జరగదని….. దేవుని మాటకు లోబడకుండా  పాపం చేసిన కారణంగా నిత్య నరకము నుండి రక్షించడానికి ఏసుక్రీస్తు ఈ లోకంలో  జన్మించారన్నారు, పాపులను రక్షించడానికి లోకానికి వచ్చిన ఏసుక్రీస్తు ప్రభువు సిలువలో తన అమూల్యమైన నిష్కలంకమైన  రక్తమును కార్చి పాపక్షమాపణ  పాపవిమోచన కలిగిస్తున్నాడనారు. ఇదే నిజమైన క్రిస్మస్ అన్నారు. ఎవరైతే ఆయన యందు విశ్వాసముంచి నమ్ముతారో అట్టి వారికి మహా సంతోషకరమైన ఆనందం కలుగుతుందన్నారు. అనంతరం క్రిస్మస్ కేకును పాస్టర్లు స్థానిక ఎంఐఎం, కాంగ్రెస్, ఇండియన్ పబ్లిక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. బహదూర్పురా నియోజకవర్గం కోఆర్డినేటర్, ఫెలోషిప్ అధ్యక్షులు బుర్రగళ్ళ కాలేబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో దూద్ బౌలి ఎంఐఎం నాయకుడు  మహమ్మద్ వహేద్ అలీ ఖాన్, టీన్ సిటీస్స్ చర్చెస్ కన్వీనర్ బి. ఆనందం, ఇండియన్ పీపుల్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీధర్, ఐపీసీ నాయకులు పుష్పాంజలి, కొండలరావు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఘనీభాయ్, పాస్టర్లు శామ్యూల్ దివాకర్, అబ్రహం, ప్రేమ్ కుమార్, సామ్యూల్ దేవి బాగ్, దేవి భాగ్ అంబేద్కర్ కమిటీ నాయకులు సిరి అన్న, వెంకటేష్, రాజ్ పాల్, సురేష్ నాయకులు పద్మిని సుధాకర్, దర్శన్,  సంపత్, పీటర్, నోయల్ డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.