నవతెలంగాణ- గోవిందరావుపేట: క్రీస్తు పుట్టినరోజు అయినా క్రిస్మస్ పండుగ కొరకు మండల వ్యాప్తంగా క్రైస్తవ ప్రార్థన మందిరాలు ముస్తాబయ్యాయి. ఆదివారం మండలంలోని చల్వాయి గోవిందరావుపేట పసర వంటి పెద్ద పెద్ద గ్రామాలలో చర్చిలను క్రైస్తవ సోదరులు రంగురంగుల విద్యుత్ దీపాలతో పేపర్లతో అలంకరించారు పశువుల పాకలో ప్రభువైన ఏసుక్రీస్తు జన్మించిన విధముగా పశువుల పాకలను నిర్మించి మేరీ మాత బాల యేసుతో కూడిన చిత్రాలను ఏర్పాటు చేసి చూసేవారికి వాస్తవాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపేందుకు చేసిన అలంకరణలు అహో అనిపించాయి. ఆదివారం ఉదయం నుండి కొన్ని ప్రార్థన మందిరాలలో రాత్రి నుండి మరికొన్ని ప్రార్ధన మందిరాలలో క్రీస్తు జన్మదినమైన క్రిస్మస్ పండుగ వేడుకలను మత గురువులు ప్రారంభించారు. రాజకీయంగా కూడా ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా మరియు వాట్సాప్ లో క్రైస్తవ సోదరులు మరియు సోదరులకు బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలుపుకోవడమే కాక బ్యానర్లను ఏర్పాటు చేసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.