జాతరలో ప్రత్యేక పూజలు నిర్వహించిన సిఐ దంపతులు..

The CI couple performed special pooja at the fair.నవతెలంగాణ – తొగుట
మండలంలోని వెంకట్రావుపేట గ్రామ. సమీపంలో ఉన్న వెంకటేశ్వర స్వామి జాతరలో తొగుట సీఐ లతీఫ్ బుధవారం రాత్రి సతీ సమేతంగా పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మతాలకు అతీతంగా అన్ని మతాల వారి సంప్ర దాయాలను గౌరవిస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ సీఐ దంపతులు మత సామారస్యాన్ని చాటుతున్నారు. స్వామి వారి ఆశీస్సులతో అంద రూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. తాము తిరుపతి కి సైతం వెళ్తామని, తమ పిల్లలు సైతం తమ బాటలో సాగుతున్న రన్నారని చెప్పారు. మొత్తం మీద మత చాంధస వాదంతో కొట్టు మిట్టాడుతున్న వారు లతీఫ్ దంప తులను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు భావిస్తున్నారు.లతీఫ్ దంపతు లను మండల బీ ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు జీడి పల్లి రాంరెడ్డి ఘనంగా సన్మానించారు. అంతకు ముందు తొగుట ఎస్ ఐ రవికాంత్ రావు జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.