
నకిలీ విత్తనాలు,ఎరువులు రైతులకు విక్రయిస్తే చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటాం అని సీఐ జితేందర్ రెడ్డి దుకాణం దారులకు హెచ్చరించారు. ఎస్పీ రోహిత్ రాజు ఉత్తర్వుల మేరకు బుధవారం స్థానిక సిఐ జితేందర్ రెడ్డి,ఎస్.హెచ్.ఒ ఎస్సై శ్రీను లు సీడ్స్,ఫర్టిలైజర్స్ దుకాణాల యజమానులతో సమావేశం నిర్వహించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా సీడ్స్ తీసుకొచ్చి రైతులకు అమ్మాలని చూస్తే వారి పైన కఠినమైన చర్యలు తీసుకుంటాం అని,నిబంధనలు అతిక్రమించిన వారి పై పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుంది అని అన్నారు.