సైబర్ నేరాల పట్లా జాగ్రత్త ఉండాలి: సిఐ కిరణ్ కుమార్

నవతెలంగాణ-చందుర్తి
సైబర్ నేరాల పట్లా జాగ్రత్త ఉండాలని స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ అన్నారు. శుక్రవారం రాత్రి లింగంపేట గ్రామంలో మీకోసం పోలీస్ అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంక్ ఖాతాలలో డబ్బులను మాయం చేయడానికి గుర్తు‌ తెలియని వ్యక్తులు మెసేజ్లో లింక్ లు పెడతారు. వాటికి స్పందించి ఓటిపి చెప్తే ఖాతలో ఉన్న డబ్భులు పోతాయని అన్నారు. అదేవిదంగా గంజాయి సేవించి యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. ద్విచక్రవాహనాలు నడిపే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు, ఆయన వెంట ఎస్సై అశోక్ ఉన్నారు.