సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: సిఐ కృష్ణ

నవతెలంగాణ – బాన్సువాడ, నసురుల్లాబాద్
సమాజంలో పెరుగుతున్న సైబర్‌ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ డయల్‌-100పై అవగాహన కలిగి ఉండాలని బాన్సువాడ టౌన్ సిఐ కృష్ణ  సూచించారు. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు పోలీసుల సాయం పొందాల్సి వస్తే, వెంటనే డయల్‌-100కు కాల్‌ చేయాలని తెలిపారు. బాన్సువాడ మండలంలోని బోర్లం ప్రభుత్వ పాఠశాలలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ కృష్ణ మాట్లాడుతూ.. అపరిచితుల వ్యక్తుల  నుంచి ఎస్ఎంఎస్‌, ఈ మెయిల్‌, వాట్సప్‌ల ద్వారా వచ్చే బ్లూ కలర్‌ లింక్స్‌ను క్లిక్‌ చేస్తే, మీ మొబైల్‌లోని డేటా మొత్తం సైబర్‌ నేరగాళ్ల చేతుల్లోకి పోతుందని హెచ్చరించారు. ఎవరైనా సైబర్‌ నేరాలకు గురైతే వెంటనే 1930కు కాల్‌ చేయాలన్నారు. మాదక ద్రవ్యాల వినియోగంతో జరిగే నష్టాలు, ఎవరైన బాలికలకు వేధిస్తే పోలీసులకు సమాచారం అందించాలని. బాలికలను ఎవరైనా వేధిస్తే శాఖ పరమైన పోక్సో కేసుల పర్యవసానాలు తప్పవని హెచ్చరించారు.  సీసీ కెమెరాల ఉపయోగాలు, రైతు లు భూమిని తాకట్టు పెట్టి రుణాలు తీసుకునే సమయంలో మోసపోకుండా ఉండేందుకు తీసుకోవా ల్సిన జాగ్రత్తలపై అవహగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పద్మా శ్రీనివాస్, సరిత, నరసింహ చారి, ఆనంద్, రాజు, అయ్యాల సంతోష్, సంగమేశ్వర్, శ్రావణ్, గంగాధర్, తేజ, జ్యోతి, పోలీసు సిబ్బంది ఉన్నారు