ఉత్తమ పోలీస్ సేవ పతాకానికి ఎంపికైన సీఐ మహేష్

నవతెలంగాణ- కమ్మర్ పల్లి
మండలంలోని చౌట్ పల్లి గ్రామానికి చెందిన సిఐ  దండిక మహేష్ ఉత్తమ పోలీస్ సేవ పతాకానికి ఎంపికయ్యారు. 2009లో ఎస్ఐగా ఎంపికైన మహేష్ శిక్షణ అనంతరం 2010 నుండి 2014 వరకు ఆర్ జిఐఏ  పోలీస్ స్టేషన్  శంషాబాద్ లో, 2014 నుండి 2018 వరకు కేపీహెచ్ బి పోలీస్ స్టేషన్ కూకట్ పల్లిలో,  2018 నుండి 2021 ఏప్రిల్ వరకు పేట్ బషీరాబాద్ పోలీస్  స్టేషన్ కొంపల్లిలో ఎస్ఐగా  విధులు నిర్వర్తించారు. 2021 ఏప్రిల్ 16న సిఐగా ప్రమోషన్ రావడంతో నల్గొండలో  విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్  విధుల్లో చేరారు. ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ రామ చంద్ర పురం సంగారెడ్డి యూనిట్ లో విధులు నిర్వహిస్తున్నారు. తెలంగాణ పోలీస్ శాఖ ప్రకటించిన 2023 సంవత్సరానికి గాను ఉత్తమ  పోలీస్ గా సేవలు అందించినందుకు  తెలంగాణ పోలీస్ సేవా పతాకానికి ఎంపికయ్యారు. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మహేష్ ఉత్తమ సేవ పతాకం అందుకోనున్నారు. కాగా మహేష్  విద్య అభ్యాసం పదవ తరగతి వరకు  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల  చౌట్  పల్లిలో,  ఇంటర్మీడియట్  డిగ్రీ ఆర్మూర్ ప్రభుత్వ జూనియర్  అండ్ డిగ్రీ కళాశాలలో,  పీజీ ఎం.కామ్  హైదర్ బాద్ లోని నిజాం కాలేజ్ లో కొనసాగింది. గ్రామానికి చెందిన వ్యక్తికి  పోలీస్ ఉత్తమ సేవా పతాకం రావడం పట్ల గ్రామస్తులు, మహేష్ స్నేహితులు హర్షం వ్యక్తం చేశారు.