
నవతెలంగాణ – శంకరపట్నం
అంతర్జాతీయ మాధకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుధవారం శంకరపట్నం మండల పరిధిలోని కేశవపట్నం మోడల్ స్కూల్లో హుజరాబాద్ రూరల్ సీఐ పులి వెంకట్ మాట్లాడుతూ.. గంజాయి వద్దు ఆరోగ్య ముద్దు అని విద్యార్థులు సమాజానికి గుర్తింపు నిచ్చే విధంగా ఉండాలని చెడు అలవాట్లకు దూరంగా ఉండి బావి తరాల భవిష్యత్తుకు బాటలు వేయాలని సిఐ తెలిపారు. అనంతరం కేశవపట్నం ఎస్సై పాకాల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, మాదకద్రవ్యాలు, చెడు వ్యసనాలకు బానిసలై బంగారు భవిష్యత్తును వృధా చేసుకోవద్దని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ చిట్టజ్యోతి, ఉపాధ్యాయులు విద్యార్థులు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.