మద్యం తాగి వాహనాలు నడపరాదు: సీఐ రంజిత్ రావు

– లారీ డ్రైవర్లు నిబంధనలు పాటించాలి
నవతెలంగాణ –  మల్హర్ రావు
లారీ డ్రైవర్లు నిబంధనలు పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని కాటారం సీఐ రంజిత్ రావు లారీ డ్రైవర్లను  హెచ్చరించారు. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా భూపాలపల్లి ఎస్పీ, కాటారం డీఎస్పీ ఆదేశాల మేరకు మంగళవారం మండలంలోని కొయ్యుర్ ఎస్ఐ వడ్లకొండ నరేశ్ ఆధ్వర్యంలో రోడ్లు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యదితిగా సీఐ హాజరై ప్రమాదాలపై డ్రైవర్లకు అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారా రోడ్డు ప్రమాదాలు జరుగుతాయన్నారు. డ్రైవర్లు లైసెన్సులు, పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ వాడటం, అతి వేగంగా డ్రైవింగ్ చేయడం ప్రమాదకరమన్నారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, సీటు బెల్టు పెట్టుకోవాలని సూచించారు. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ కుమారస్వామి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.