చట్టం పరిధికి లోబడి విధులు నిర్వర్తిస్తాం. సీఐ శంకర్

నవతెలంగాణ-గోవిందరావుపేట
చట్టం పరిధికి లోబడి పోలీసులుగా తమ వంతు బాధ్యతలను నిర్వర్తిస్తామని, చట్టం ఎవరికి చుట్టం కాదని, ఎవరిమీద ఉద్దేశపూర్వకంగా కేసులు నమోదు చేయమని పసర పోలీస్ స్టేషన్ సీఐ శంకర్ అన్నారు. శనివారం మండలంలోని పసర పోలీస్ స్టేషన్లో సీఐ శంకర్ మీడియాతో మాట్లాడారు.చల్వయి గ్రామం లో 4 ఎకరాల వక్ఫ్ బోర్డు భూమి కి సంబంధించిన వివాదంలో అదే గ్రామానికి చెందిన ఎండి. రఫీ,  ఫారెస్ట్ బీట్ అధికారి అయిన టీ.దీపలాల్  పై వివస్పదభూమి విషయంలో  అసభ్యకరంగా మాట్లాడి, బెదిరింపులకు పాల్పడినాడు అని అతని ఫిర్యాదు మేరకు పస్రా పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు  చేయటము జరిగిందన్నారు.  ఆ కేసు మీద విచారణ కొనసాగుతోంది. ఈ కేసు విచారణలో భాగంగా వివాదానికి సంబంధించిన భూమి యొక్క యాజమాన్య హక్కు వివరాల కొరకు మరియు అట్టి వివస్పదభూమి సర్వే నిర్వహించమని  మండల తహసిల్దార్ నీ కోరుతూ కోరుతూ కేసు వివరాలు   పంపనైనదన్నారు. ఇట్టి విషయంలో కేవలం బాధితుడి ఫిర్యాదు మేరకు మాత్రమే కేసు నమోదు చేయడం జరిగింది కానీ ఉద్దేశపూర్వకంగా చేసిన కేసు కాదు. గతంలో పస్రా మండలంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్  ఇచ్చిన అనేక ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసాము. ఏదైనా పట్టదగిన నేరంకు సంబంధించిన పిర్యాదు/సమాచారం వచ్చినప్పుడు జాప్యం లేకుండా కేసు నమోదు చేయడం అనేది పోలీసుల యొక్క ప్రాథమిక బాధ్యత దానిలో భాగంగానే చల్వాయి గ్రామానికి చెందిన ఎండి రఫీ ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేయడం జరిగింది తప్ప దీనిలో పోలీసు వారికి ఎటువంటి దురుద్దేశం లేదు. చట్టం ముందు అందరూ సమానమే. ఇట్టి కేసు విషయంపై కేసు జరిగిన మరుసటిరోజే ఫారెస్ట్ సంబంధిత అధికారులు పస్రా సిఐ ని సంప్రదించగా కేసు ప్రాథమిక విచారణ దశలో ఉంది కావున పూర్తి విచారణ జరిపి తదనంతరం తగు వివరాలు తెలియ పరుస్తామని చెప్పినప్పటికీ ఫారెస్ట్ ఉద్యోగుల సంఘం వారు వ్యవహరించిన తీరు ఆక్షేపనీయం. కావున విచారణకు అందరూ సహకరించాలని కోరుచున్నాము. అలాగే భూమి యాజమాన్యంపై వివాదం ఏర్పడితే, రెండు పార్టీలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకుండా రెవెన్యూ లేదా న్యాయ అధికారులను సంప్రదించి పరిష్కారం కోసం అభ్యర్ధించాలి.  చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని సరైన ప్రక్రియను పాటించని వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.