గుత్తి కోయగూడెంలోకి గుంపులోకి అపరిచితులు కానీ కొత్త వ్యక్తులు కానీ వస్తే వెంటనే సమాచారం అందించాలని పసర పోలీస్ స్టేషన్ సిఐ జి రవీందర్ అన్నారు. బుధవారం మండలంలోని దేవుని గుట్ట గుత్తి గుడాన్ని ఎస్ ఐ కమలాకర్ తో కలిసి సిఐ రవీందర్ సందర్శించారు. ఈ సందర్భంగా గుత్తి కోయలతో సిఐ రవీందర్ మాట్లాడుతూ అపరిచిత వ్యక్తులకు ఆశ్రయం కల్పించకుడదని ఎవరైనా కొత్త వ్యక్తులు తమ గ్రామం కు వస్తే తమకు సమాచారం అందించాలని తెలియచేసారు.చట్ట వ్యతిరేక మైన కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.అంతే కాకుండా అక్కడి ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రానున్న వానాకాలం దృశ్య వరదలు సంభవిస్తే తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించటం జరిగింది.ఈ సందర్భం లో అజ్ఞాత మావోయిస్టు ల సమాచారం తెలిపే వాల్ పోస్టర్లు అంటించటం జరిగింది. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.