ప్రజలకు అండగా మేమున్నామన్న భరోసా కల్పించేందుకే ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుందని సీఐ పీ.శ్రీనివాస్ తెలిపారు. శాంతి భద్రతల పర్యవేక్షణ,అల్లర్లను అదుపు చేసేందుకు రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సహాయాన్నందిస్తుందన్నారు.సిద్దిపేట సీపీ అనురాధ ఆదేశానుసారం సోమవారం దుబ్బాక పట్టణ కేంద్రంలో రాపిడ్ యాక్షన్ స్పోర్ట్స్ డిప్యూటీ కమాండెంట్ డీపీ బగేల్,ఇన్స్పెక్టర్ లు హరిబాబు,మల్లేశ్వరరావు,దుబ్బాక సర్కిల్ పరిధిలోని దుబ్బాక ఎస్ఐ గంగరాజు,మిరుదొడ్డి ఎస్ఐ పర్శరామ్,భూంపల్లి ఎస్ఐ హరీష్ లతో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ ఫ్లాగ్ మార్చ్ లో ఆర్ఏఎఫ్ సిబ్బంది,ట్రైనీ ఎస్ఐ ,హెడ్ కానిస్టేబుల్ హరి సింగ్,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.