గంజాయి మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా చూడాలి: సీఐ శ్రీనివాస్ 

Ganja should not be taken for intoxicants: CI Srinivasనవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
గ్రామంలో యువకులు గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల బారిన పడకుండా చూసుకోవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుందని హుస్నాబాద్ సిఐ శ్రీనివాస్ అన్నారు.ఆదివారం హుస్నాబాద్ మండలంలోని  పోతారం ఎస్  గ్రామాన్ని  హుస్నాబాద్ సీఐ శ్రీనివాస్, ఎస్ఐ మహేష్ సందర్శించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ పోలీస్ డిపార్ట్మెంట్ తీర్చవలసిన ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆరా తీశారు.యువకులు ఏదైనా మత్తు పదార్థాలు సేవిస్తున్నారని తెలిస్తే  వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు .వారిని పిలిచి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలిపారు.  ప్రజల రక్షణకు సీసీ కెమెరాలు చాలా ముఖ్యమని  సీసీ కెమెరాలు పనిచేయని గ్రామాలలో  ప్రజలు ప్రజాప్రతినిధులు వ్యాపారస్తులు సీసీ కెమెరాల ఏర్పాటుకు పోలీస్ డిపార్ట్మెంట్ కు సహకరించాలని సూచించారు. ప్రభుత్వం నిషేధించిన  గుడుంబా నాటు సారాయి  తయారు చేయవద్దని సూచించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు . బ్యాంకు అధికారులమని రుణమాఫీ అయిందని  కేవైసీ అప్డేట్ చేయాలని కారణాలతో సైబర్ నేరగాళ్లు ఫోన్ చేస్తే ఎవ్వరు కూడా బ్యాంకు వివరాలు మీ పర్సనల్ డాటా ను షేర్ చేయవద్దని సూచించారు. రుణమాఫీ విషయంలో ఏదైనా సమస్య ఉంటే నేరుగా బ్యాంకు వెళ్లి బ్యాంకు అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. ఆన్లైన్ మోసాల బారిన ఎవరు కూడా పడవద్దని తెలిపారు. ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే వెంటనే 1930 సైబర్ సెల్ జాతీయ ప్లైన్ నెంబర్ కు ఫోన్ చేసి  ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు. గ్రామాలలో ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగితే  వెంటనే డయల్ 100 కు కాల్ చేసి తెలుపాలని సూచించారు. ప్రజల సమస్యలు తీర్చడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవల అందిస్తామని తెలిపారు.  ప్రజల ధన మాన ప్రాణ రక్షణకు డిపార్ట్మెంట్ ఎప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యువకులు ప్రజలు ప్రజాప్రతినిధులు  పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.