చైనా మాంజా అమ్మితే ఏడేండ్లు జైలు.. లక్షట్ పేట సిఐ శ్రీనివాస్ హెచ్చరిక

నవతెలంగాణ – జన్నారం
చైనా మాంజాపై రాష్ట్ర ప్రభుత్వం నిషేదం విధించిందని, పర్యా వరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం అమ్మినా, కొనుగోలు చేసి నా నేరమే అవుతుందని, చైనా మాంజాను అమ్మితే ఏడేండ్లు జైలు శిక్షతో పాటు పది వేల జరిమానా విధించడం జరుగుతుందని లక్షట్ పేట సిఐ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడు తూ లక్షట్ పేట సర్కిల్లోని ఏ షాపులోనైనా చైనా మంజాను విక్రయించరా దని తెలిపారు. నైలాన్, సింతటిక్ దారాలతో తయారు చేసే ఈ చైనా మాంజాలతో పర్యావరణానికి విపత్తు కావడంతో జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు చై నా మాంజా వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, వీటిని ఎట్టి పరిస్థితుల్లో విక్ర యించరాదన్నారు. అదే విధంగా ప్రజలు సైతం చైనా మాంజా వినియోగించకుం డా ఎవరికి హానీ కలగని సాధారణ దారంతో గాలిపటాలను ఎగరవేసుకోవాలన్నా రు. ఎవరైనా చైనా మాంజా విక్రయిస్తున్నా, వినియోగిస్తున్నా డయల్ 100కు ఫో న్ చేసి సమాచారం ఇవ్వాలని సిఐ శ్రీనివాస్  కోరారు. వచ్చే సంక్రాంతి పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని అన్నారు. చైనా మాంజాలతో ప్రాణాలకే ప్రమాదకరమన్నారు.