
తుంగతుర్తి మండల పరిధిలోని అన్నారం గ్రామంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) వారి ఆర్థిక సహకారంతో ఏర్పాటుచేసిన మెడికల్ షాప్ ను సోమవారం తుంగతుర్తి సీఐ శ్రీను నాయక్ ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాణ్యమైన మందులు సేవలతో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు. వినియోగదారులను చిరునవ్వుతో పలకరిస్తూ, వారి అభిమానాన్ని చూరగొనాలని సూచించారు.ఈ సందర్భంగా షాపు యజమాని కడెం సైదులు రమణ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు సేవ చేస్తూ ఆర్థికంగా ఎదగాలని సూచించారు.ఈ కార్యక్రమంలో దొంగరి శ్రీనివాస్, ఏపీఎం రాంబాబు,సీసీ గడ్డం గిరి,మండల పరిధిలోని వివిధ గ్రామాల ఆర్ఎంపీలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.