
వినాయక విగ్రహాల ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి అని తుంగతుర్తి సర్కిల్ సిఐ శ్రీను నాయక్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ విగ్రహాల ఏర్పాటు సమయంలో,విగ్రహాల నిమజ్జనం సమయాలలో అనుమతితోపాటు పోలీసులు సూచించిన నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు.ప్రతి విగ్రహానికి పోలీస్ వారి నుండి తప్పనిసరిగా పర్మిషన్ తీసుకొని ఉండాలని మండపం రోడ్డుకి అడ్డంగా పెట్టి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించవద్దని కరెంటు ల్యాండ్ ఓనర్ అనుమతులు ఉండాలని సూచించారు.మండపాల వద్ద నీళ్ల డ్రమ్ము నిండా నీరు సంచులలో ఇసుక నింపి ఉంచాలని సూచించారు.మండపాల వద్ద స్పీకర్లు ఉదయం 5:30 నుండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే పెట్టాలని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని సూచించారు. మద్యం సేవించి మండపంలో ఉండరాదని రాత్రి వేళల్లో తాగుకుంటూ పేకాట ఆడుకుంటూ ఉంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.పోటీతత్వంతో ఉత్సవాలు జరపకూడదని సోదర భావంతో కలిసిమెలిసి పండుగలు జరుపుకోవాలని డీజేలు బాణసంచా పూర్తిగా నిషేధమని తెలిపారు.నిమజ్జనం సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.