
వ్యాపారులు రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని పసర పోలీస్ స్టేషన్ సి ఐ వి శంకర్ అన్నారు. బుధవారం మండలంలోని పసర పోలీస్ స్టేషన్లో విత్తన , పురుగు మందుల వ్యాపారులతో ఎస్ ఐ ఏ కమలాకర్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వ్యాపారులను ఉద్దేశించి సీఐ శంకర్ మాట్లాడారు. రానున్న ఖరీఫ్ సీజన్ ను ఉద్దేశించి వ్యాపారులకు తగు సూచనలు చేయడం జరిగింది. ఖరీఫ్ లో రైతులు అధిక మొత్తంలో సాగు చేయడం ను దృష్టిలో ఉంచుకొని విత్తన వ్యాపారులు మేలైన విత్తనాలను మాత్రమే రైతులకు అమ్మాలని, అమ్మిన ప్రతి పాకెట్ కు సరి అయిన బిల్లులు ఉండాలని చెప్పారు.తప్పకుండా తమ దుకాణాల్లో స్టాక్ రిజిస్టర్ మెయింటైన్ చేయాలని, నాసిరకం విత్తనాలను, గడువు తీరిన మందులను రైతులకు అమ్మితే ఉపేక్షించేది లేదని,అటువంటి వారిపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలియచేసారు.ఈ సందర్బంగా ఎస్ ఐ కమలాకర్ మాట్లాడుతూ ప్రభుత్వ అనుమతి పొందిన విత్తన కంపెనీలు అమ్మే విత్తనాలను మాత్రమే మార్కెట్ లోకి తేవాలని , బోగస్ కంపెనీలు అమ్మే వాటిని ప్రోత్సహించ కూడదు అని , అన్ని రకాల పరీక్షలు విజయవంతం అయిన వాటిని మాత్రమే రైతులకు చేర్చడం విత్తన వ్యాపారుల బాధ్యత అని తెలియచేసారు. నకిలీ విత్తనాలు విక్రయించిన వారిపై ప్రభుత్వం నిబంధన ప్రకారం కఠిన చర్యలు శిక్షలు ఉంటాయని హెచ్చరించారు.