నవతెలంగాణ – సిద్ధిపేట
ప్రజలు, వాహనాల నడిపే ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలను పాటించాలని, ప్రమాదాలను నివారించాలని వన్టౌన్ సిఐ వాసుదేవరావు సూచించారు. ఆదివారం పాత బస్టాండ్ వద్ద సిబ్బందితో కలిసి జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా వాహనదారులకు, ప్రయాణికులకు, ఆటో డ్రైవర్లకు రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనల గురించి అవగాహన కల్పించారు.