జీవితంలో విద్యార్థి దశ ఎంతో కీలకమైంది: సీఐ వెంకటేశ్వర్లు

నవతెలంగాణ – ముత్తారం

జీవితంలో విద్యార్థి దశ ఎంతో కీలకమైందని మంథని సీఐ వెంకటేశ్వర్లు అన్నారు. ముత్తారం మండలం పోతారం, లక్కారం, ముత్తారం, అడవి శ్రీరాంపూర్, ఓడేడ్, ఖమ్మంపల్లిలోని మోడల్ స్కూల్, కస్తూర్బా గాం ధీ, ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ముత్తారం ఎస్ఐ మధుసూదన్ రావు ఆ ధ్వర్యంలో పరీక్ష ప్యాడ్లు, పెన్నులను శనివారం పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా మంథని సిఐ వెంకటేష్ కృష్ణ హాజరు కాగా ఆయన చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభ త్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ప్రైవేట్ ధీటుగా ఫలితాలను సాధించాలని, విద్యార్థులు ఆందోళన కు గురి కాకుండా పరీక్షలు వ్రాయాలని అన్నారు. 10వ తరగతి అంటేనే జీవితానికి మొదటి మెట్టని అన్నా రు. మొదటి మెట్టు నుండి పీజీ వరకు క్రమశిక్షణగా చదువుకుంటే రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉం టుందని తెలిపారు. 10వ తరగతి పరీక్షల్లో 10 జిపిఎ సాదించిన విద్యార్థులకు రామగుండం కమిషనర్ చే తుల మీదుగా మొదటి బహుమతిగా నగదు అందిస్తామని అన్నారు. కష్టపడి చదివి బంగారు భవిష్యత్కు బా టలు వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులు, ఉపాధ్యాయ లు పాల్గొన్నారు.