సిఐడిఎస్పి డుంగ్రుతూ నాగరాజు జన్మదిన వేడుకలు

– తొర్రూర్ వ్యవసాయ మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ జిలకర యాలాద్రి
నవతెలంగాణ – నెల్లికుదురు
హైదరాబాదులోని సిఐడి ఎస్పీ గా విధులు నిర్వహిస్తున్న డుంగ్రూత్ నాగరాజు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు తొర్రూరు వ్యవసాయ మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ జిలకర యాలాద్రి తెలిపాడు.. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆయన జన్మదిన వేడుకలు పురస్కరించుకొని కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకొని రోగులకు పండ్లను పంపిణీ చేసే కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయన జన్మదిన వేడుకలను మండల కేంద్రంలో అనేక మందితో కలిసి జన్మదిన వేడుకలను నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు ఆయన ఎంతోమందికి సేవ చేశారని తెలిపాడు ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్  మండల అధ్యక్షుడు తూళ్ళ వెంకన్న  పి హెచ్ సి డాక్టర్ వంశీకృష్ణ వైద్య సిబ్బంది శారద ప్రజలు పాల్గొన్నారు.