– ఐటిఐఎ క్లీన్‌చిట్‌తో ఊరట
న్యూయార్క్: టాప్‌సీడ్ టెన్నిస్ ఆటగాడు, ఇటలీకి చెందిన జెన్నిక్ సిన్నర్‌కు ఊరట లభించింది. నిషేధిత ఉత్ప్రేరకాలను తీసుకోవడంతో రెండుసార్లు పాజిటివ్ వచ్చిన సిన్నర్‌కు తాజాగా అంతర్జాతీయ టెన్నిస్ ఇంటిగ్రిటీ ఏజెన్సీ(ఐటిఐఎ) క్లీన్‌చిట్ ఇస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. 2024 ఇండియన్ వెల్స్ మాస్టర్స్ టోర్నీ శాంపిల్స్‌లో తక్కువస్థాయిలో క్లోస్టెబోల్ మెటాబోలైట్ ఉన్నట్లు తేలింది. చిన్న గాయానికి మందు రావడం కారణంగా ఇలా జరిగిందని పరీక్షల్లో తేలింది. ఇక రెండోసార్లు డోప్ పరీక్షలకు ఉల్లంఘనలకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఐటిఐఎ బుధవారం సమావేశమై స్పోర్ట్స్ నిబంధనలను అతడు అతిక్రమించలేదని, స్వతంత్ర ట్రిబ్యునల్ తీర్పునిచ్చింది. దీంతో అతడు వచ్చే వారం నుంచి ప్రారంభమయ్యే యుఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో బరిలో దిగేందుకు దారి సుగమమైంది.
సిన్సినాటి ఓపెన్ ఫైనల్లో సిన్నర్ 7-6(7-4), 6-2తో స్థానిక ఆటగాడు టఫీని ఓడించి టైటిల్‌ను చేజిక్కించు కున్నాడు. ఇక మహిళల సింగిల్స్ టైటిల్ 3వ సీడ్, బెలారస్‌కు చెందిన సబలెంక కైవసం చేసుకుంది. ఫైనల్లో సబలెంక 6-3, 7-5తో 6వ సీడ్, అమెరికాకు చెందిన పెగూలాను ఓడించింది.