హీరో అల్లరి నరేష్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘బచ్చల మల్లి’. సుబ్బు మంగాదేవి దర్శకుడు. అమృత అయ్యర్ హీరోయిన్. ‘సామజవరగమన, ఊరు పేరు భైరవకోన’ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మించారు. క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమా ఈనెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత రాజేష్ దండా మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు. ఇది క్యారెక్టర్ డ్రివెన్ సినిమా. 1980లో జరిగే కథ. ఇది రియల్ లైఫ్ స్టోరీ కాదు. మా డైరెక్టర్‌ది తుని. అదే ఊర్లో బచ్చలమల్లి అనే ఒక వ్యక్తి ఉన్నారు. కేవలం ఆయన పేరుని మాత్రమే ఈ సినిమా కోసం తీసుకున్నాం. ఇది పూర్తిగా ఫిక్షనల్ స్టోరీ. రామ్ చరణ్‌కి ‘రంగస్థలం’ ఎలానో నరేష్‌కి ‘బచ్చలమల్లి’ అలాంటి సినిమా అవుతుంది. సినిమా అద్భుతంగా వచ్చింది. సినిమా చూసి ఇది నరేష్ 2.0 అని ఫీల్ అవుతారు. ఆయన నట విశ్వ రూపాన్ని చూస్తారు. లైఫ్‌లో తప్పులు చేయొచ్చు. కానీ సరిదిద్దుకోలేని తప్పులు చేస్తే ఎలా ఉంటుందో ఇందులో చూపించాం. మూర్ఖత్వం బోర్డర్ దాటేసిన క్యారెక్టర్ని నరేష్ చేశారు. సినిమాలో ఎమోషన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. డైరెక్టర్ సుబ్బు చాలా కసితో సినిమా చేశాడు. ఈ సినిమాలో విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ వన్ అఫ్ ది హైలెట్. పాటలు ఇప్పటికే జనాల్లోకి వెళ్ళాయి. సినిమా చూసిన తర్వాత ఇంకా బాగా కనెక్ట్ అవుతారు. డిఓపి రిచర్డ్ ఎం నాథన్, ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకడలి, ఫైట్ మాస్టర్ పృధ్వీ పనితనం ప్రధాన ఆకర్షణ అవుతుంది. ఇవన్ని సినిమాని నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్ళాయి. సందీప్ కిషన్‌తో చేస్తున్న ‘మజాకా’ నాకు చాలా ఇష్టమైన సినిమా. అలాగే కిరణ్ అబ్బవరం సినిమా ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక పాన్ ఇండియా సబ్జెక్ట్ కుదిరింది. అలాగే నరేష్‌తో ‘సామజవరగమణ’ లాంటి కథతో సినిమా ఉంటుంది. వీటి గురించి త్వరలోనే చెబుతాను.